శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది!
- October 23, 2016
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండడం లేదు. విదేశాల నుంచి ప్రయాణికులు ఏదో ఒక మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. బ్యాగ్‌లోనో లేదా షూ స్ లేదంటే తల వెంట్రుకల్లో గోల్డ్‌ను అక్రమంగా స్వదేశానికి చేరవేస్తునే ఉన్నారు. కస్టమ్స్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో అక్రమ బంగారం పట్టుబడడం సాధారణంగా మారింది.
తాజాగా తమిళనాడుకు చెందిన ఓ ప్రయాణికుడు కిలోన్నర బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ దొరికిపోయాడు. మస్కట్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఆయన లగేజీ దాచిపెట్టాడు. అయితే అధికారులు తనిఖీలు నిర్వహించగా ఆయన గుట్టు రట్టయింది. నిందితున్ని అదుపులోకి తీసుకొని కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 40 లక్షలకు పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







