మహేష్‌బాబు కొత్త సినిమా విడుదల ముహూర్తం ఏప్రిల్‌లో...
- October 23, 2016
సూపర్ స్టార్ మహేష్‌బాబు కొత్త సినిమా విడుదల ముహూర్తం ఏప్రిల్‌లో నిర్ణయించారు. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో మహేష్ ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారిగా నటిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. హైదరాబాద్, చెన్నైలో షెడ్యూల్స్ చేశారు. డిసెంబర్ లో టాకీ పార్టు, జనవరి కల్లా మొత్తం షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. తర్వాత రెండు నెలలు నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకోనున్నారు. ఏప్రిల్ లో సినిమా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. 'బిజినెస్‌మేన్' తర్వాత మహేష్ తక్కువ సమయంలో పూర్తి చేస్తున్న చిత్రమిదే కానుంది.
ఏప్రిల్ 14న మహేష్ బాబు కొత్త సినిమా తెరపైకి రానున్నట్లు తెలిసింది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కుతోందీ చిత్రం.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







