క్యాపిటల్‌లో మాన్యువల్ కార్ వాష్ బ్యాన్!
- October 24, 2016
మనామా: మాన్యువల్ కార్ వాషర్స్, క్యాపిటల్‌లోని టూరిజం మరియు కమర్షియల్ ప్రాంతాల్లో బ్యాన్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. క్యాపిటల్ గవర్నరేట్ కో-ఆర్డినేటింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చాయి. భవిష్యత్తులో కొత్త పర్మిట్లు ఇవ్వకుండా, ఇప్పుడున్న పర్మిట్లను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి సెక్యూరిటీ మరియు సర్వీసెస్ అథారిటీస్ ప్రతినితులు హాజరయ్యారు. మాన్యువల్ హ్యాంన వాషింగ్ కారణంగా పర్యాటకులపై నెగెటివ్ ప్రభావం పడుతోందని ఈ సందర్భంగా అదికారులు చెప్పారు. దీంతోపాటుగా స్ట్రే డాగ్స్ సహా పలు అంశాలు చర్చకు వచ్చాయి. స్ట్రే డాగ్స్‌తో సమస్యలు ఎక్కువయ్యాయని అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పూర్తిస్థాయి స్టడీ అనంతరం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సమావేశంలో తీర్మానించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







