అలా చేస్తే బరువు తగ్గరు
- August 21, 2015
అధిక బరువుతో బాధపడేవాళ్లు ఇది తినకూడదేమో, అది తినకూడదేమో అని భయపడుతూ, కొన్ని మన శరీరానికి మేలు చేసే ఆహార పదార్ధాలను కూడా తినడం మానేస్తుంటారు. వాటిలో ముఖ్యమైంది పిండి పదార్ధాలు. వీటిని తీసుకుంటే లావైపోతామని భావించి వీటిని తినే విషయంలో చాలా అజాగ్రత్త చూపిస్తుంటారు. కానీ పిండి పదార్థాల్లో ఉండే అనేక రకాల ప్రొటీన్స్ ఖచ్చితంగా మన శరీరానికి అవసరమైనవి ఉంటాయి. ఇవి శరీరానికి అందకపోతే చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మనక్కావల్సిన పిండి పదార్దాలను ఎంచుకోవడమెలాగంటే.. గోధుమలు, బార్లీలాంటి వాటిలో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది కొందరికి పడకపోవచ్చు, అప్పుడు కడుపుబ్బరం, అజీర్తిలాంటి సమస్యలొస్తాయి. అందుకే ఇలాంటి పదార్ధాలను కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఓట్స్‌లోని సాల్యుబుల్, అన్ సాల్యుబుల్ పీచు పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించి, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి. చిరుధాన్యాలూ, గింజధాన్యాలూ, మొలకెత్తిన గింజలు మొదలగు పిండిపదార్ధాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడడమే కాకుండా, శరీర తక్షణ శక్తికి కావల్సిన ప్రోటీన్స్‌ని తగు మోతాదులో అందించడానికి తోడ్పడతాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







