3 సూపర్‌ మార్కెట్స్‌పై ఉక్కుపాదం

- October 24, 2016 , by Maagulf
3 సూపర్‌ మార్కెట్స్‌పై ఉక్కుపాదం

అల్‌ ఖోర్‌ మరియు అల్‌ థకిరా మునిసిపాలిటీ, మూడు సూపర్‌ మార్కెట్స్‌ని శాశ్వతంగా మూసివేస్తూ నిర్ణయం ప్రకటించింది. అవసరమైన లైసెన్సులు లేకుండా ఫుడ్‌ స్టఫ్‌ని విక్రయిస్తుండడాన్ని అధికారిక వర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. మునిసిపాలిటీ డైరెక్టర్‌ జుమా ఖామిస్‌ అల్‌ మురైఖి ఈ మేరకు అడ్మినిస్ట్రేటివ్‌ డెసిషన్‌ని జారీ చేశారు. మూడు ఔట్‌ లెట్స్‌లోనూ ఉల్లంఘనల్ని హెల్త్‌ కంట్రోల్‌ సెక్షన్‌ గుర్తించింది. మానవులు సేవించడానికి ఏమాత్రం అనుకూలంగా లేని ఆహారాన్ని ఈ సందర్భంగా అదికారులు గుర్తించడం జరిగింది. ఇంకో వైపున ఎంఎంఇ స్టేట్‌మెంట్‌లో, టెక్నికల్‌ కంట్రోల్‌ సెక్షన్‌ - అల్‌ దాయెన్‌ మునిసిపాలిటీ 26 ఉల్లంఘనల రిపోర్టుల్ని జారీ సెప్టెంబర్‌లో జారీ చేసినట్లు పేర్కొంది. ఐదు ఇతర రిపోర్టుల్ని అల్‌ షమాల్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ కి రిఫర్‌ చేశారు. నాలుగు రిజాల్వ్‌ కాగా, 17 ఇంకా ప్రాసెస్‌లో ఉన్నాయి. సెప్టెంబర్‌లో హెల్త్‌ కంట్రోల్‌ సెక్షన్‌ 262 ఇన్‌స్పెక్షన్స్‌ నిర్వహించింది. 39 వార్నింగ్స్‌ ఇవ్వగా, ఆరు ఫిర్యాదుల్ని ఇన్వెస్టిగేట్‌ చేసింది. ఆరు ఉల్లంఘనల రిపోర్టుల్ని కూడా ఫాలో అప్‌ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com