యూఏఈలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కలకలం
- October 24, 2016
సమ్మర్ నుంచి వింటర్ దిశగా వాతావరణ పరిస్థితులు మారుతుండడంతో యూఏఈలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ చాలా యాక్టివ్‌గా మారుతున్నట్లు డాక్టర్లు హెచ్చరించారు. వాక్సినేషన్ ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని వారు సూచించడం జరుగుతోంది. ఇటీవలి కాలంలో నమోదవుతున్న ఎమర్జన్సీ కేసుల్లో 15 శాతం కేవలం ఫ్లూ కారణంగానేనని డాక్టర్ హస్సన్ కాజియా పేర్కొన్నారు. ఎక్కువ తీవ్రతతో కూడిన జ్వరం, చలి, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, నీరసం వంటి సమస్యలు తలెత్తగానే వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా వచ్చే జ్వరం, జలుబుకి భిన్నంగా వైరస్ కారణంగా వచ్చే సమస్యలుంటాయనీ, వీటి విషయంలో ఏమాత్రం అజాగ్రత్త తగదని డాక్టర్లు హెచ్చరించడం జరుగుతోంది. పరిశుభ్రతను పాటించడం, పబ్లిక్ ప్లేస్‌లకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇన్‌ఫ్లుయెంజా నుంచి తప్పించుకోడానికి ఆస్కారం ఉంది. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు నోటికి, అలాగే ముక్కుకి అడ్డంగా కర్చీఫ్ లేదా మాస్క్ ఉంచుకోవడం వల్ల ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తిని కొంతమేర తగ్గించవచ్చు. ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉండేందుకు సి-విటమిన్ ఉండే పదార్థాల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆవిరిని పట్టడం ద్వారా చిన్న చిన్న సమస్యలను దూరం చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







