3 సూపర్ మార్కెట్స్పై ఉక్కుపాదం
- October 24, 2016
అల్ ఖోర్ మరియు అల్ థకిరా మునిసిపాలిటీ, మూడు సూపర్ మార్కెట్స్‌ని శాశ్వతంగా మూసివేస్తూ నిర్ణయం ప్రకటించింది. అవసరమైన లైసెన్సులు లేకుండా ఫుడ్ స్టఫ్‌ని విక్రయిస్తుండడాన్ని అధికారిక వర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. మునిసిపాలిటీ డైరెక్టర్ జుమా ఖామిస్ అల్ మురైఖి ఈ మేరకు అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్‌ని జారీ చేశారు. మూడు ఔట్ లెట్స్‌లోనూ ఉల్లంఘనల్ని హెల్త్ కంట్రోల్ సెక్షన్ గుర్తించింది. మానవులు సేవించడానికి ఏమాత్రం అనుకూలంగా లేని ఆహారాన్ని ఈ సందర్భంగా అదికారులు గుర్తించడం జరిగింది. ఇంకో వైపున ఎంఎంఇ స్టేట్మెంట్లో, టెక్నికల్ కంట్రోల్ సెక్షన్ - అల్ దాయెన్ మునిసిపాలిటీ 26 ఉల్లంఘనల రిపోర్టుల్ని జారీ సెప్టెంబర్‌లో జారీ చేసినట్లు పేర్కొంది. ఐదు ఇతర రిపోర్టుల్ని అల్ షమాల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కి రిఫర్ చేశారు. నాలుగు రిజాల్వ్ కాగా, 17 ఇంకా ప్రాసెస్‌లో ఉన్నాయి. సెప్టెంబర్‌లో హెల్త్ కంట్రోల్ సెక్షన్ 262 ఇన్స్పెక్షన్స్ నిర్వహించింది. 39 వార్నింగ్స్ ఇవ్వగా, ఆరు ఫిర్యాదుల్ని ఇన్వెస్టిగేట్ చేసింది. ఆరు ఉల్లంఘనల రిపోర్టుల్ని కూడా ఫాలో అప్ చేసింది.
తాజా వార్తలు
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ







