దీపావళికి లగ్జరీ కార్ల అమ్మకాలు...
- October 25, 2016
దీపావళికి లగ్జరీ కార్ల అమ్మకాలు వావ్ అనేలా ఉండబోతున్నాయి. గత ఏడాదికన్నా ఈ సారి ఈ ఫెస్టివల్ కి మెర్సిడెస్ బెంజ్, స్కోడా వంటి ఖరీదైన కార్లకు డిమాండ్ బాగా పెరిగిందని హైదరాబాద్ లోని షో రూమ్ నిర్వాహకులు చెబుతున్నారు. వీటి అమ్మకాలు ఈ సారి 30 శాతం పెరిగాయట. ముఖ్యంగా 22 ఏళ్ళ నుంచి 30-35 ఏళ్ళ టెక్కీలు వీటిని సొంతం చేసుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నారని తెలిసింది.50 లక్షల నుంచి 70 లక్షల వరకు పెట్టి అయినా సరే లగ్జరీ కార్లను కొందామని అనుకుంటున్నవారు కొందరైతే, కోటి రూపాయలైనా వెనుకాడబోమని మరికొంతమంది ముందుకు రావడం షో రూమ్ నిర్వాహకులను ఆశ్చర్యపరుస్తోంది. గత సంవత్సరం దీపావళి సీజన్ లో సుమారు 50 కార్లను తాము అమ్మామని, అయితే ఈ సారి బుకింగ్ లు 30 శాతం పెరిగాయని అంటున్నారు.దీపావళికి ముందు వచ్చే ధంతేరాస్ నాటికే తాము కొత్త కార్ల సొంతదారులం కావాలని చాలామంది తహతహలాడుతున్నారు.ఇక చాలా షో రూమ్ లు ఇస్తున్న ఆఫర్లు, స్కీమ్ లు కూడా వీరిని చాలా ఆకర్షిస్తున్నాయి. ఏడాదికి ఈ ఎం ఐ రేట్లు తక్కువగా ఉన్నాయని భావిస్తున్న పలువురు ఉత్సాహంగా ఈ కార్ల కొనుగోలుకోసం షో రూమ్ ల వద్ద బారులు తీరుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







