'ఓం నమో వెంకటేశాయ' గురువారం నుంచి కొత్త షెడ్యూల్...

- October 25, 2016 , by Maagulf
'ఓం నమో వెంకటేశాయ' గురువారం నుంచి కొత్త షెడ్యూల్...

రాఘవేంద్రరావు- నాగార్జున కాంబినేషన్‌లో వస్తోంది 'ఓం నమో వెంకటేశాయ'. దీనికి సంబంధించి ఇప్పటికే రకరకాల పిక్స్ రాగా, లేటెస్ట్‌గా హథీరాంబాబా గెటప్‌లోవున్న నాగ్ ఒరిజినల్ స్టిల్ బయటకువచ్చింది. లొకేషన్ ఎక్కడ అన్నది పక్కనబెడితే.. చుట్టూ ఫారెస్ట్ మధ్యలో నాగార్జున కనిపించడంతో తిరుపతి పరసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగి వుండవచ్చని భావిస్తున్నారు.
అంతకుముందు మహాబలేశ్వరంలో కొన్ని సీన్స్‌ని తెరకెక్కించింది యూనిట్. గురువారం నుంచి కొత్త షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. హథీరాంబాబా లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీనివాసుడిగా టీవీ యాక్టర్ సౌరబ్, మహాభక్తురాలు కృష్ణమ్మగా అనుష్క, హథీరాంబాబా గా నాగార్జున కనిపించనున్నారు.

కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ కూడా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com