బహ్రెయిన్ హజ్ యాత్రీకులు నిబంధనలు పాటించాలి

- August 22, 2015 , by Maagulf
బహ్రెయిన్  హజ్ యాత్రీకులు నిబంధనలు పాటించాలి

బహ్రెయిన్  నుండి మక్కా కు హజ్ యాత్ర నిమిత్తమై వచ్చే నెల  వెళ్లనున్న సుమారు 3500 మంది యాత్రీకులు, పెరిగిన భద్రతా నియమావళి ప్రకారం నడుచుకోవాలని, రాజకీయ సంబంధమైన సాహిత్యాన్ని కలిగిఉండడo లేదా మతవిధానాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం వంటి చర్యలు శిక్షార్హమైనవని, ఆంతరంగిక శాఖ పోర్టు సెక్యూరిటీ  డైరక్టర్ జనరల్- కల్నల్ మహెర్ అహ్మద్ బువాలీ  హెచ్చరించారు. ఇంకా బస్సు డ్రైవర్లు యాత్రీకుల భద్రత కోసం, ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అసిస్టెంట్ డ్రైవర్లను కలిగిఉండాలని హెచ్చరించారు. హజ్ మెడికల్ మిషన్ కో-ఆర్దీనేషన్ ఛైర్మన్ డా. అలీ అల్ బక్కారా మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న 51 రిజిష్టర్డ్ మక్కా కరవాన్లు ఐనా నియమనింబంధనలు పాటించి  వెక్సినేషన్లు చేయించుకోవాలని,  యజమానులు మేనేజర్లకు విజ్ఞప్తి చేశారు.   అధికారులకు చెప్పాపేట్టకుండా యాత్రకు వెళ్ళిపోయే భక్తులు తమకు పెద్ద సవాలని కూడా ఆయన తెలియజేశారు.


--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com