18వ గ్లోబల్‌ విమెన్‌ లీడర్‌షిప్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌

- October 25, 2016 , by Maagulf

18వ గ్లోబల్‌ విమెన్‌ లీడర్‌షిప్‌ (విల్‌) ఎకనమిక్‌ ఫోరమ్‌ దుబాయ్‌లోని డిఐఎఫ్‌సి రిట్జ్‌ కార్టన్‌ హోటల్‌లో అక్టోబర్‌ 24 మరియు 25 తేదీల్లో జరిగింది. యూఏఈ మినిస్టర్‌ ఆఫ్‌ ఎకానమీ సుల్తాన్‌ బిన్‌ సయీద్‌ అన మన్సౌరి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 500 మందికి పైగా ప్రపంచ వ్యాప్తంగా మేల్‌ మరియు ఫిమేల్‌ బిజినెస్‌ లీడర్స్‌, పాలసీ మేకర్స్‌, అలాగే యంగ్‌ ఫిమేల్‌ ప్రొఫెషనల్స్‌, ఎంటర్‌ప్రెన్యూసర్స్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ మరియు దుబాయ్‌లోని ఫ్రెంచ్‌ బిజినెస్‌ ఫెలిసిటేషన్‌ కంపెనీ నసీబా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. మినిస్టర్‌ ఆఫ్‌ ఎకానమీ సుల్తాన్‌ బిన్‌ సయీద్‌ అల్‌ మన్సౌరి ఈ కార్యక్రమంలో విల్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్స్‌ని పలువురికి అందజేశారు. స్టోరీ టెల్లింగ్‌, ఫ్యూచర్‌ బిల్డింగ్‌, గేమ్‌ చేంజర్స్‌ వంటి విభాగాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఫోరమ్‌లో పార్టిసిపెంట్లకు సిపిడి సర్టిఫికెట్లను అందజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com