ఇల్లీగల్ ధనంతో రెండు భవనాల కొనుగోలు
- October 26, 2016
మనామా: మనీ లాండరింగ్, అక్రమ ఫండ్ రైజింగ్ ద్వారా అక్రమంగా ఆర్జించిన ఓ క్లిరిక్ రెండు భవనాల్ని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. 500,000 మరియు 560,000 బహ్రెయినీ దినార్ల విలువైన ఈ భవనాలకు సంబంధించిన వివరాల్ని ప్రాసిక్యూషన్ ధృవీకరించింది. ఇసా ఖాసిమ్, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అక్రమంగా పండ్ రైజింగ్ చేపట్టాడు. బహ్రెయిన్‌కి వ్యతిరేకంగా ఈ నిధుల సమీకరణ జరిగినట్లు అభియోగాలున్నాయి. ఎవరికీ అనుమానాలు రాకుండా చిన్న చిన్న మొత్తాల్ని ఎక్కువసార్లు డిపాజిట్ చేసినట్లు విచారణలో తేలింది. రోజువారీ డిపాజిట్ల మ్తొం 6,000 బహ్రెయినీ దినార్లకు మించకుండా వారు జాగ్రత్తపడ్డారు. తన పేరు మీద ఇసా కాసిమ్ 1 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తుల్ని కూడగట్టినట్లు మిగతా ఇద్దరు వ్యక్తులు పేర్కొన్నారు. విచారణలో 10,000,000 డాలర్ల మొత్తం అతని బ్యాంకులో గతంలో జమ అయినట్లు తేలింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







