`నాన్న, నేను నా బాయ్‌ఫ్రెండ్స్` రైట్స్‌ను సొంతం చేసుకున్నదిల్‌రాజు
- October 26, 2016
'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం ఆరంభించిన బెక్కెం వేణుగోపాల్ (గోపి) అప్పట్నుంచీ వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. లక్కీ మీడియా ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ నుంచి ఇటీవల వచ్చిన 'సినిమా చూపిస్త మావ' ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ సక్సెస్‌ఫుల్ బ్యానర్ నుండి దర్శకుడు సుకుమార్ నిర్మించిన 'కుమార్ 21 ఎఫ్'తో బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్న హెబ్బా పటేల్ కథానాయికగా లక్కీమీడియా బ్యానర్‌పై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్`. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ పోస్టర్ ను, ఓ సాంగ్‌ను బుధవారం రేడియో మిర్చిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత బెక్కం వేణుగోపాల్(గోపి), దర్శకుడు భాస్కర్ బండి, అశ్విన్ బాబు ,పార్వతీశం, నోయెల్ సేన్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా....
చిత్ర నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ - ``నాన్న, నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సినిమా కథ కోసం దాదాపు ఏడాదిగా కసరత్తులు చేశాం. ఇది యూత్ ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ సినిమా ద్వారా . ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు భాస్కర్ బండి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. ఈ కథను ముందు ప్రముఖ నిర్మాత దిల్ రాజుగారికి వినిపించాం. ఆయన కథ విని కొన్ని మార్పులు చేయమని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే కథలో చేంజస్ చేసి సినిమా తీశాం. ఫస్ట్ కాపీ చూసి దిల్ రాజుగారు సినిమా చాలా బావుందని అప్రిసియేట్ చేశారు. గతంలో మా బ్యానర్‌లో వచ్చిన `సినిమా చూపిస్త మావ` సినిమా చూసిన రాజుగారు సినిమా నచ్చడంతో నైజాం హక్కులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు `నాన్న, నేను నా బాయ్‌ఫ్రెండ్స్` సినిమా చూసి బాగా నచ్చడంతో సినిమాకు సంబంధించిన మొత్తం హక్కులను మంచి ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇలా రాజుగారు కంటెంట్‌పై నమ్మకంతో విడుదల చేసిన హ్యాపీడేస్, పటాస్ వంటి చిత్రాలు ఘన విజయాలను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాన్న, నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సినిమా విషయంలో అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. త్వరలోనే ఆడియో, సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
రావు రమేష్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్ బాబు ,పార్వతీశం, నోయెల్ సేన్, కృష్ణభగవాన్, సనా, తోటపల్లి మధు, ధనరాజ్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి కథః బి.సాయికృష్ణ, పాటలుః చంద్రబోస్, భాస్కరభట్ల, వరికుప్పల యాదగిరి, కాసర్ల శ్యామ్, కొరియోగ్రఫీః విజయ్ ప్రకాష్, స్టంట్స్ః వెంకట్, స్క్రీన్‌ప్లే, మాటలుః బి.ప్రసన్నకుమార్, ఎడిటర్ః చోటా కె.ప్రసాద్, ఆర్ట్ః విఠల్ కోసనం, మ్యూజిక్ః శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీః చోటా కె.నాయుడు, ప్రొడక్షన్ః లక్కీ మీడియా, నిర్మాతః బెక్కం వేణుగోపాల్(గోపి), దర్శకత్వంః భాస్కర్ బండి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







