ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై తూనికలు, కొలతల శాఖ కేసు
- October 26, 2016
ప్యాకేజి వస్తువుల నియమాలు సక్రమంగా పాటించడం లేదని ప్రముఖ ఈకామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై తూనికలు, కొలతల శాఖ కేసు నమోదు చేసింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ శాఖ అధికారులు ఈ సంస్థలకు చెందిన గిడ్డంగులపై దాడి చేసి రూ.70 లక్షల విలువ చేసే ఉత్పత్తులను సీజ్ చేశారు.
ప్యాకేజి నియమాలు ఉల్లంఘించిన కారణంగా ఇన్‌స్టాకార్ట్ వారి నుండి రూ.37లక్షల విలువ గల 18 రకాల ప్యాకేజి వస్తువులు, అమెజాన్ సెల్లర్స్ సర్వీసెస్ నుంచి రూ. 47.7 లక్షల విలువగల వస్తువులను సీజ్ చేశారు. అంతేకాకుండా వాటిపై గరిష్ఠ చిల్లర ధర, ప్యాకేజి మీద రాసిన బరువు విషయంలో కూడా అవకతవకలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







