ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్న 'కయాంత్'
- October 26, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 'కయాంత్' తుపాను వణికిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి క్రమంగా విశాఖ వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 480 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు ఈశాన్యంగా 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







