రష్యా, బ్రిటన్ దేశాల సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధవాతావరణం
- October 26, 2016
రష్యా, బ్రిటన్ దేశాల సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొంది. గతకొద్ది రోజులుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న యుద్ధసన్నాహాలకు బ్రిటన్ సభ్యదేశాలు ప్రతిస్పందిస్తున్నాయి. బ్రిటన్, రష్యా సరిహద్దు ప్రాంతం ఎస్టోనియాకు తన బలగాలను భారీగా తరలిస్తున్నాయి. మరోవైపు నాటో సభ్యదేశాలు బ్రిటన్‌కు మద్ధతుగా నిలుస్తున్నాయి. దీంతో బ్రిటన్ భారీగా యుద్ధ ట్యాంకులు, డ్రోన్లు, దాదాపు 800 ట్రూప్స్ బలగాలను సరిహద్దుకు తరలించింది. దీంతో ఏక్షణానఏమి జరుగుతుందోనని ప్రపంచవ్యాప్తంగా తీవ్రగందరగోళం ఏర్పడింది. రష్యా అణుబాంబు ప్రయోగించడానికి తగిన ఏర్పాట్లు చేస్తుండడం, తమ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, జాగ్రత్తలు తీసుకోవడం, కొద్దిరోజుల క్రితం ఇంగ్లీష్ చానెల్‌పై రష్యా ఎయిర్‌క్రాఫ్ట్ ప్రయాణించడం వంటి కారణాలతో రష్యా, బ్రిటన్ దేశాల నాయకుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రష్యా దాడిచేస్తే ఎదుర్కుంటామని ప్రజలకు అభయమిచ్చేందుకు బ్రిటన్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







