సంసారంలో చిచ్చు పెట్టిన చిలుకమ్మ
- October 26, 2016
దుబాయ్: ముద్దు ముద్దుగా చిలక పలుకులు విందామని...ముచ్చటపడి ఓ చిలకను పెంచుకుంటే ఆ నారద పక్షి ఆలుమగల మధ్య పెద్ద అగాధాలు సృష్టించింది...కువైట్ లో ఓ చిలుక ఇంట్లోనే సీక్రెట్ ఏజెంట్ పాత్ర పోషించి పెంచిన యజమానినే దాదాపుగా జైలుకు పంపే పరిస్థితి తెచ్చిపెట్టింది వివరాలలోకి వెళితే, కుటుంబంలో ఎంచక్కా కలసిపోయిన ఓ చిట్టి చిలకమ్మ గూట్లో ఉండక....గుట్టు బయటపెట్టింది. ఓ రోజు ఆ వ్యక్తి భార్య ముందు పనిమనిషితో మీ ఆయన నడిపే అక్రమ సంబంధం గూర్చి తెల్సా నీకు అంటూ గుటుక్కుమని వివరించింది. దాంతో చిలుక పలుకులు ఆ సంసారంలో సూది ములుకులుగా మారేయి. చిలుక అంతటితో ఊరుకొక రెట్టించిన ఉత్సాహంతో, పనిమనిషి, తన యజమానికి మధ్య జరిగిన సరసమైన సంభాషణ శైలిని అనుకరిస్తూ తన యజమానురాలికి పూసగుచ్చినట్లు వివరించేసరికి వళ్ళు మండిన ఆ భార్య కువైట్ లోని హవాలీ పోలీసు స్టేషన్లో అధికారుల వద్దకు వెళ్లి తన భర్త తనను మోసం చేస్తూ, పనిమనిషితో సరస సల్లాపాలు కొనసాగిస్తున్నాడని వారిపై చర్య తీసుకోండంటూ ఫిర్యాదు చేసింది. ఇందుకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు ఆమెను ప్రశ్నించగా చిలకమ్మ తనకు తోడుగా ఉండి..జరిగింది జరిగినట్లు ఎప్పటికప్పుడు తెలియచేస్తుందని తెలిపింది. ఈ చిలుక సాక్ష్యాలు సరిపోవని ఇవి కోర్టులో ప్రాసిక్యూషన్ అంగీకరించదని ఆమెకు పోలీసులు నచ్చ చెప్పే యత్నం చేశారు.మనుష్యుల మాటలను చిలుకలు అనుకరణ చేయగలవు. పక్షి సన్నిహితంగా ఉండి మానవ సంభాషణలను అనుకరించగలవు. చిలకలు పలికిన మాటల బట్టి తీర్పులు ఇవ్వలేమని కోర్టులో వాటిని అంగీకరించడం సాధ్యం కాదని తెలిపారు. టీ వి లేదా రేడియోలలో వచ్చే సంభాషణలు సైతం అనుకరిస్తాయి.అయితే, ప్రాసిక్యూషన్ అధికారులు ఆ కేసును విశ్వసనీయ సాక్ష్యం ఆధారంగా నేరంగా భావించడం సాధ్యం కాదని అన్నారు. వ్యభిచారం గల్ఫ్ దేశాలలో చట్ట విరుద్ధమని..సరైన ఆధారాలు లేకుండా శిక్షలు వేయడం సాధ్యం కాదని న్యాయస్థానం తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







