దీపావళి కానుకగా 'భైరవ' సినిమా టీజర్‌ విడుదల..

- October 28, 2016 , by Maagulf
దీపావళి కానుకగా 'భైరవ' సినిమా టీజర్‌ విడుదల..

కలెక్షన్ల పరంగా ప్రతీ సినిమాకు కొత్త రికార్డును సృష్టిస్తున్నారు 'ఇలయ తలబది' విజయ్‌. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న కొత్తచిత్రం 'భైరవ'. విజయా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా దీపావళి కానుకగా విజయ్‌ తన అభిమానుల కోసం 'భైరవ' సినిమా టీజర్‌ను విడుదల చేశారు. 1.07 నిమిషాల పాటు సాగే ఈ టీజర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. 'నీఎన్న వసూల్‌ మన్ననా?'(నువ్వేమైనా కలెక్షన్‌ కింగా?) అని విలన్‌ అడగ్గా.. 'ఆమా వెలియ అప్పడిదా పేసికిరాంగ' (అవును బయట అలాగే మాట్లాడుకుంటున్నారు) అని విజయ్‌ చెప్పే డైలాగును ఈ టీజర్‌ చివర్లో ప్రస్తావించారు.

మొత్తానికి సినిమాపై కలెక్షన్ల పరంగా చిత్రయూనిట్‌ పెద్దఎత్తున అంచనాలు పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. 'కత్తి', 'తుప్పాక్కి' సినిమాలతో రికార్డులు సృష్టించిన విజయ్‌.. ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను సృష్టిస్తారో వేచిచూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com