విమానం బోయింగ్ 767 ప్రమాదానికి గురైంది...
- October 28, 2016
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బోయింగ్ 767 ప్రమాదానికి గురైంది. చికాగో విమానాశ్రయంలో రన్‌వేపై టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హుటాహుటిన ప్రయాణికులు, సిబ్బంది కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. చికాగో నుంచి మియామీ వెళ్తున్న ఈ విమానంలో 161 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. స్వల్పంగా గాయపడిన 20 మందికి వివిద ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తున్నట్లు చికాగో అగ్నిమాపక విభాగం అధికారి జువాన్ హెర్నాండెజ్ వెల్లడించారు. .
ప్రయాణికులకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని, వారిని మియామికి మరో విమానంలో పంపిస్తామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. టైరు పేలడం వల్ల మంటలు అంటుకున్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చెప్తుండగా.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ మాత్రం ఇంజిన్‌లో సమస్య తలెత్తినట్లు భావిస్తున్నామని తెలిపింది. అగ్నిమాపక విభాగం అధికారులు కూడా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ప్రయాణికులు బయటకు వెళ్తుండగా తీసిన వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. విమానం వద్ద నల్లని దట్టమైన పొగలు వ్యాపిస్తూ మంటలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







