ఆస్ట్రేలియాలో దారుణం చోటుచేసుకుంది..
- October 28, 2016
ఆస్ట్రేలియాలో దారుణం చోటుచేసుకుంది. భారతీయ సంతతికి చెందిన ఓ బస్సు డ్రైవర్‌పై ఓ ప్రయాణికుడు తేలికగా మండే ద్రావకంతో దాడిచేయడంతో మంటలు వ్యాపించి సజీవ దహనమయ్యాడు. మృతుడు మన్‌మీత్ అలీషర్ బ్రిస్బేన్‌లోని పంజాబీ జాతీయుల్లో పేరుగాంచిన సింగర్ కావడం గమనార్హం. అకస్మాత్తుగా, అనూహ్య రీతిలో జరిగిన ఈ ఘటనతో బస్సులో మంటలు వ్యాపించాయి. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటపడ్డారు. మరికొంతమందిని స్థానికులు రక్షించడంతో ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. దిగ్భ్రాంతిని కలిగించే ఈ ఘటన వెనుక జాత్యహంకార కోణం లేదని పోలీస్ కమిషనర్ ఇయాన్ స్టివార్ట్ వెల్లడించారు. ఈ ఘటనలో బస్సులో మంటలు వ్యాపించకపోవడంతో ప్రాణనష్టం పెరగలేదని ఆయన పేర్కొన్నారు.48 ఏళ్ల అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







