అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు అంబరాన్నంటాయి..
- October 29, 2016
మరావతి షాపింగ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు అంబరాన్నంటాయి.. పవిత్ర సంగమం దగ్గర బాణసంచా వెలుగులు మిన్నంటాయి.. హారతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన లక్ష్యమన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో దీనావళి వెలుగు నింపాలని ఆకాంక్షించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం దగ్గర నిర్వహించిన అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు.రాష్ట్రంలో వెనుకబడిన కులాలు, వర్గాలు, ప్రాంతాలు, జిల్లాలు అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అందుకోసం ప్రతి పేదకుటుంబానికి సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబానికి 10వేల ఆదాయం చేకూర్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేద మంత్రాల నడుమ కృష్ణమ్మకు పవిత్ర హారతి ఇచ్చారు పండితులు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు.ఇక హారతి అనంతరం నరకాసుర వధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా బాణం వేశారు. ఆ తర్వాత సంగమం ప్రాంతమంతా బాణసంచా వెలుగులు మిన్నంటాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







