తమ మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించుకునే దిశగా భారత్-చైనాలు.
- October 29, 2016
విధ అంశాలపై తమ మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించుకునే దిశగా భారత్-చైనాలు అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే రెండు దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు నవంబరు మొదటి వారంలో సమావేశం కానున్నారు. ఎన్‌ఎస్‌జీలో భారత్ సభ్యత్వం, జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌పై ఐరాస నిషేధాన్ని అడ్డుకోవడానికి చైనా ప్రయత్నాలు, దాదాపు 46 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో చైనా నిర్మించ తలపెట్టిన చైనా-పాక్ ఆర్థిక కారిడార్(సీపీసీ)పై భారత్ నిరసనతో పాటు పలు అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. భారత్ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, చైనా జాతీయ భద్రత సలహాదారు యాంగ్ జియేచిలు హైదరాబాద్‌లో సమావేశమవుతారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పరిస్థితిపై అధికారికంగా చర్చలు జరుపుతారు. ప్రత్యేకించి ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న చికాకులపై చర్చలు జరుగుతాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







