దీపావళి వేడుక - జర్నీ ఆఫ్‌ ఇండియన్‌ బ్రైడ్‌

- October 30, 2016 , by Maagulf

జర్నీ ఆఫ్‌ ఇండియన్‌ బ్రైడ్‌ అనే థీమ్‌ మేరకు భారతదేశానికి చెందిన తొమ్మిది మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేవారు. దీపావళి సందర్బంగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొమ్మిది మంది మహిళలు సంప్రదాయ చీరకట్టులోనూ, భారీగా ఆభరణాలతోనూ, జాస్మిన్‌ ప్లవర్స్‌తోనూ కనిపించి కనువిందు చేశారు. ఒవిలియా ఈ కాన్సెప్ట్‌ని డిజైన్‌ చేసింది. ప్రీతి, నసీమా, పూనమ్‌, భాగ్యశ్రీ, సిల్వియా, షోలా, సిస్మి మరియు అంజలి మోడల్స్‌గా ఈ కార్యక్రమంలో సందడి చేయడం జరిగింది. దీపావళి సందర్భంగా ఈ కొత్త కాన్సెప్ట్‌ అందర్నీ అలరించింది. దుబాయ్‌లోని పెష్వ రెస్టారెంట్‌ ఈ ఈవెంట్‌కి వేదికయ్యింది. ఈ సందర్భంగా సచిన్‌ నర్హార్‌ జోషి, శ్రియా జోషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అభినంద్‌ అభి ఫొటోగ్రఫీ, రాధికా శర్మ అండ్‌ టీమ్‌ మేకప్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com