రీడింగ్‌పై చట్టాన్ని జపారీ చేసిన ప్రెసిడెంట్‌ ఖలీఫా

- October 31, 2016 , by Maagulf
రీడింగ్‌పై చట్టాన్ని జపారీ చేసిన ప్రెసిడెంట్‌ ఖలీఫా

ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, సోమవారం రీడింగ్‌పై చట్టాన్ని విడుదల చేశారు. 'నాలెడ్జ్‌ బ్రీఫ్‌ కేస్‌'ని ప్రారంభించడం ఈ చట్టం తాలూకు ముఖ్య ఉద్దేశ్యం. ఉద్యోగులు, తమ పని సమయాల్లోనూ చదువుకునేందుకు వీలు కల్పిస్తారు. రీడింగ్‌ మెటీరియల్‌పై ఎలాంటి ట్యాక్స్‌లు ఉండవనీ, పబ్లిషింగ్‌ సెక్టార్‌కి ఊతమిచ్చేలా ఈ చట్టం రూపొందిందని అధికారులు తెలిపారు. ఎడిటర్స్‌, ఆథర్స్‌కి మరిన్ని సౌకర్యాలు కల్పించేలా ఈ చట్టంలో వెసులుబాట్లు కల్పించారు. కాఫీ షాప్స్‌, షాపింగ్‌ మాల్స్‌లో వినియోగదారులకు చదువుకునేందుకు పుస్తకాల్ని అందుబాటులో ఉంచేలా ఈ చట్టం ద్వారా అవకాశం కల్పించడం గమనించదగ్గది. ప్రైవేట్‌ సెక్టార్‌, లైబ్రరీలను ఏర్పాటు చేయడాన్ని ప్రోత్సహించేందుకూ ఈ చట్టం ఉపయోగపడుతుంది. చదవడంపై అవగాహన పెంచేందుకోసం చేపట్టే కార్యక్రమాలకు నిధుల కేటాయింపు జరిగేలా ఓ ఫండ్‌ని కూడా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com