కలెక్టేరేట్‌లో భారీ శబ్ధంతో పేలుడు

- November 01, 2016 , by Maagulf
కలెక్టేరేట్‌లో భారీ శబ్ధంతో పేలుడు

కేరళలోని మలప్పురం కలెక్టరేట్‌ ప్రాంగణంలో మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిలిపి ఉంచిన కారులో భారీ శబ్ధంతో పేలుడు సంభవించినట్లు గుర్తించారు.

ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం కాగా, ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ హుటాహుటిన అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
దుండగులు ప్రెషర్ కుక్కర్ బాంబును అమర్చిపేల్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కారును హోమియో డీఎంఓదిగా గుర్తించారు. కాగా, ఘటనా స్థలంలో కరుడు గట్టిన ఉగ్రవాది ఒసాబా బిన్ లాడెన్ ఫొటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పేలుడు వెనక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com