భారీ డ్రగ్ రాకెట్ గుట్టును రట్టు...
- November 02, 2016
భారీ డ్రగ్ రాకెట్ గుట్టును రట్టు చేసింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్- డీఐఆర్. దీని విలువ అక్షరాలా మూడువేల కోట్ల రూపాయలు. ఈ స్థాయిలో నారోటిక్ డ్రగ్స్ పట్టుబడడం దేశంలో ఇదే ఫస్ట్‌టైమ్. అక్టోబర్ 28న రాజస్థాన్‌లోని ఉదయపూర్ సమీపంలో మరుధర్ డ్రింక్స్ కంపెనీపై దాడులు చేశారు డీఆర్ఐ అధికారులు.నిషేధిత మ్యాండ్యాక్స్ ట్యాబ్లెట్స్ అధికంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ టాబ్లెట్ల బరువు 23 వేల 500 కేజీలు. అంతర్జాతీయ మార్కెట్లో అయితే 4,500 కోట్ల రూపాయలు విలువ చేయవచ్చన్నది అంచనా! ఈ డ్రగ్ వ్యవహారంతో సంబంధమున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్ సుభాష్ దుధానిని అదుపులోకి విచారిస్తున్నారు. బీఎస్ఎఫ్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







