ఇరాక్ ప్రత్యేక బలగాలు మోసుల్ సరిహద్దుల్లో అడుగు పెట్టాయి...
- November 02, 2016
ఇరాక్ ప్రత్యేక బలగాలు మోసుల్ సరిహద్దుల్లో అడుగు పెట్టాయి. ఐసిస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న మోసుల్ నగరాన్ని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు సర్వ శక్తులను ఒడ్డుతున్నాయి. ఇందులో భాగంగా ఇరాక్ దళాలు మంగళవారం నగర శివార్లలోకి అడుగుపెట్టాయి.నగరంలో తిష్టవేసిన ఐసిస్ ఉగ్రవాదులు ప్రతిఘటిస్తున్నప్పటికీ ప్రభుత్వ దళాలు ముందుకు కదులుతున్నట్లు ఇరాక్ జనరల్ తెలిపారు. ఇరాక్‌లో రెండవ పెద్ద నగరమైన మోసుల్‌లోకి గత రెండేళ్లలో ప్రభుత్వ దళాలు అడుగు పెట్టడం ఇదే తొలిసారి.
పట్టణంలోని ఇంటింటిలో ఉగ్రవాదుల ఏరివేత చేపట్టవలసి ఉంది. మోసుల్ నగర పరిధిలోని గాగ్జలిలో దళాలు అడుగుపెట్టిన్టటు ఇరాక్ ప్రత్యేక దళాల మేజర్ జనరల్ సమి అల్ అరిడి తెలిపారు.ఐసిస్ ఉగ్రవాదులపై ప్రత్యేక దళాలు విరుచుకుపడుతున్నాయని, నగరంలోని రోడ్ల వెంబడి బాంబులు అమర్చి ఉన్నందున ఆచూతూచి దళాలు అడ్వాన్స్ అవుతున్నట్టు చెప్పారు.ఇరాక్ దళాలు, ఫిరంగులు, ట్యాంకులు, మెషీన్ గన్లతో ఐసిస్ స్థావరాలపై దాడులు జరుపుతున్నాయి. యాంటీ ట్యాంక్ మిసైల్స్, తేలికపాటి ఆయుధాలతో ప్రభుత్వ బలగాలు ముందుకు రాకుండా ఐసిస్ సాయుధులు అడ్డుకుంటున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







