ఆ సమస్యల్నిలా దూరం చేసుకోవచ్చు
- August 25, 2015
మహిళల్ని సాధారణంగా వేధించే సమస్యల్లో ముఖ్యమైనవి మూత్ర సంబంధిత వ్యాధులు. సహజంగా ఈ సమస్యలు చిన్నవే అయినా వారిని ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల్ని దూరంగా ఉంచుకోవాలంటే సాధారణంగా మనం రోజూ తీసుకునే ఆహారంలోనే కొన్ని రకాల పదార్ధాలు తరచూ తీసుకోవడం ఎంతో ముఖ్యం. వాటిల్లో క్యాబేజీ, కాలీ ఫ్లవర్‌లాంటి కూరగాయల్లో ఉండే విటమిన్ కె, విటమిన్ సి, పీచు పదార్ధాలు బరువుని అదుపులో ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందువల్ల మూత్ర పిండ సంబంధిత వ్యాధులు, తద్వారా వచ్చే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడంలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మనం రోజూ తీసుకునే ఉల్లిపాయలు శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే మూత్ర పిండాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. అలాగే వెల్లుల్లి, క్యారెట్, ముల్లంగి వంటి వాటిని తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు వంటివి దరి చేరకుండా చేసి, మూత్ర పిండాలకు మేలు చేస్తాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







