చిక్కుడుకాయ 65
- August 25, 2015
కావలిసిన పదార్ధాలు
చిక్కుడు కాయలు - పావుకిలో
పచ్చిమిర్చి - అర డజను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు
సోయ సాస్ - రెండు స్పూన్లు
చిల్లీ సాస్ - రెండు స్పూన్లు
ఉల్లి తరుగు - ఒక స్పూను
మైదా - రెండు స్పూన్లు
కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు - తగినంత
కారం - ఒకటిన్నర స్పూను
ఆరెంజ్ కలర్ - ఒక స్పూను
కరివేపాకు - కొద్దిగా
తయారీ విధానం
ముందుగా చిక్కుడు కాయలను కడిగి, ఈనెలు తీసి, రెండు ముక్కలుగా కోయాలి. ఓ గిన్నెలో కార్న్ ఫ్లోర్, మైదాపిండి, అల్లం వెలుల్లి పేస్ట్, ఆరెంజ్ రెడ్ కలర్, చిల్లీ సాస్, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి పలుచగా పిండిలా కలపాలి. ఇప్పుడు ఒక్కో చిక్కుడి కాయ ముక్కను అందులో ముంచి నూనెలో వేసి వేయించి పక్కన పెట్టాలి. మరో బాణలిలో నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, సోయా సాస్ వేసి వేగాక వేయించిన చిక్కుడు కాయ ముక్కలను వేసి కలిపితే చిక్కుడు 65 రెడీ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







