దుబాయ్ ఎక్స్పో 2020 సన్నాహక సమావేశం
- November 03, 2016
మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్, డైరెక్టర్ జనరల్ ఫర్ దుబాయ్ ఎక్ప్ఓ 2020 బ్యూరో రీమ్ అల్ హాషిమి, దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దెవా) మేనేజింగ్ డైరెక్టర్ సయీద్ మొహమ్మద్ అల్ తాయెర్తో సమావేశమయ్యారు. దెవా హెడ్ ఆఫీస్‌లో ఈ సమావేశం జరిగింది. ఎక్స్పోకి సంబంధించి దెవా సహాయ సహకారాలపై ఈ సమావేశంలో చర్చించారు. దుబాయ్ ఎక్స్పో 2020కి సంబంధించిన ప్రిపరేషన్స్‌పై కాంప్రహెన్సివ్ రివ్యూ ఈ సమావేశంలో జరిగింది. దుబాయ్ ఎక్స్పోకి అన్ని విధాలా దెవా సహాయ సహకారాలు అందిస్తుందని అల్ తాయెర్, అల్ హాషిమికి హామీ ఇచ్చారు. దుబాయ్ ఎక్స్పోకి సంబంధించిన ప్రిపరేషన్లో భాగంగా 132/11 కిలోవాట్ సబ్ స్టేషన్స్, 45 కిలోమీటర్ల హై ఓల్టేజ్ (132 కెవి) కేబుల్స్కి సంబంధించిన ప్రోగ్రస్పైనా చర్చించారు. ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టుల ఖర్చు మొత్తం 420 మిలియన్ డాలర్లు కానుంది. ఎక్స్పో 2020, మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సోలార్ పార్క్‌కి కనెక్ట్ చేయబడుతుంది. ఈ పార్క్ ద్వారా 200 మెగావాట్స్ క్లీన్ ఎనర్జీని అందించనుంది. 2017 నాటికి ఈ పార్క్ తాలూకు సబ్స్టేషన్స్ పని ప్రారంభిస్తాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







