అమ్నెస్టీ తర్వాత కఠిన చర్యలు తప్పవు
- November 03, 2016
మూడు నెలల అమ్నెస్టీ ముగిసిన తర్వాత అక్రమంగా నివసిస్తున్నవారిపై సెర్చ్ అండ్ ఫాలో అప్ డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కఠిన చర్యలు తీసుకోనుంది. సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. సెర్చ్ అండ్ ఫాలో అప్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా జబెర్ లెబ్దా మాట్లాడుతూ, అమ్నెస్టీని చాలామంది ఆశ్రయించారనీ, గ్రేస్ పీరియడ్లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోనివారిపై కఠినచర్యలు ఉంటాయని అన్నారు. అమ్నెస్టీ ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో ఇన్స్పెక్షన్ కార్యక్రమం ఉంటుందని తెలిపారాయన. డిసెంబర్ 1తో అమ్నెస్టీ పీరియడ్ ముగియనుంది. అమ్నెస్టీని పొడిగించే అవకాశం ప్రస్తుతానికి అయితే లేదనీ, ప్రస్తుతం కేటాయించిన సమయం సరిపోతుందని బ్రిగేడియర్ లెబ్దా అభిప్రాయపడ్డారు. ఎయిర్ టికెట్ విషయంలో ఇబ్బందులేమైనా తలెత్తితే, అలాంటివారిని మానవీయ కోణంలో ఆదుకునేందుకు డిపార్ట్మెంట్ ముందుకు వస్తుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







