50 కోట్లతో తెలంగాణ సి.యం క్యాంప్ ఆఫీస్!
- November 03, 2016
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ సకల హంగులతో ఏర్పాటు కానుంది. బేగంపేట క్యాంపు కార్యాలయం నివాసానికి అనువుగా లేదని పంజాగుట్ట వద్ద నిర్మిస్తున్నారు. ఆర్ అండ్ బి అధికారులు నాలుగు నెలల కిందట పనులు ప్రారంభించారు. ఈ కాంట్రాక్టును షాపూర్ జీ-పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. భవన సముదాయం కోసం మొత్తం తొమ్మిది ఎకరాలు కేటాయించారు. ఇందులో ఎకరం విస్తీర్ణంలో మూడు భవనాలు నిర్మిస్తున్నారు. మిగిలిన ఎనిమిది ఎకరాల్లో 300 కార్ల పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట దీని నిర్మాణ ఖర్చు 33 కోట్లు అవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు అది 50 కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. క్యాంప్ కార్యాలయాన్ని దసరానాటికి పూర్తిచేయాలనుకున్నప్పటికీ అది పూర్తికాలేదు. -
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







