త్వరలో విడుదల కానున్న 'పిజ్జా-2'
- November 03, 2016
తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న చిత్రం 'పురియత్ పుధీర్'. ఈ చిత్రాన్ని 'పిజ్జా-2' పేరుతో డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి. వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ.. 'ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకొని థ్రిల్లర్ జోనర్‌లో ఈ చిత్రం రూపొందించారు. వరుసగా ఏడు హిట్లతో తమిళ సినీ రంగంలో ముందంజలో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతికి ఈ చిత్రం ఎనిమిదో హిట్‌గా నిలుస్తుంది.
ఇటీవల తమిళంలో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ను 48 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది వీక్షించడం హీరో క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది. అతి త్వరలోనే తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను విడుదల చేసి, ఇదే నెలలో రెండు భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ.. ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి చక్కగా తీర్చిదిద్దారు' అన్నారు.
ఈ చిత్రంలో గాయత్రి కథానాయికగా నటిస్తున్నారు. చిత్రానికి సంగీతం: శామ్ సీఎస్, సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్, ఎడిటర్: భావన శ్రీకుమార్.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







