పని గంటల్లోనే పెట్రోల్ అమ్మకాలు
- November 03, 2016
15న పూర్తిగా బంక్ లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోలియం డీలర్లు నిరసనబాట పట్టారు. ఈ నిరసనలో భాగంగా ప్రధాన చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ల నుంచి గురు, శుక్రవారాలు రెండురోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఎల్లుండి (శనివారం) నుంచి కేవలం పనిగంటల్లోనే అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పెట్రోల్ బంకులు పనిచేస్తాయని తెలిపారు.
సాయంత్రం ఆరు దాటిన తర్వాత బంకుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు నిలిపివేస్తామని చెప్పారు. 6వ తేదీ నుంచి ప్రతి ఆదివారం, ప్రతి రెండో, నాలుగో శనివారంతోపాటు బ్యాంకు, ప్రభుత్వ సెలవు దినాల్లోనూ పెట్రోల్, డీజిల్ అమ్మకాలను నిలిపివేసి.. బంకులను మూసివేస్తామని తెలిపారు. ఈ నెల 15న పెట్రోల్ బంకులను పూర్తిగా మూసివేసి ఒకరోజు బంద్ పాటిస్తామని చెప్పారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా డీలర్లు ఇప్పటికే గత నెల 19, 26 తేదీల్లో సాయంత్రం 15 నిమిషాలపాటు లైట్లు తీసివేసి, అమ్మకాలు నిలిపి బ్లాకౌట్ పాటించారు.
కమీషన్ పెంచాల్సిందే
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ప్రస్తుతం 3 శాతంగా ఉన్న కమీషన్‌ను 5 శాతానికి పెంచాలని డీలర్లు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. ఆరు నెలలకోసారి తమ కమీషన్‌ను పెంచే దిశగా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చిన చమురు సంస్థలు ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదని మండిపడుతున్నారు. అంతేకాకుండా డీలర్లకు తెలియజేయకుండా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే విధానానికి స్వస్తి చెప్పాలని, అనవసరంగా కొత్త పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వరాదని, 2012లో జారీ చేసిన మార్కెటింగ్ డిసిప్లైన్ గైడ్‌లైన్స్(ఎండీజీ)ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిని నెరవేర్చకపోతే నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







