మాట మరువం.. హామీలు అమలు చేస్తా తిరుపతి వస్తా.. ప్రకటన చేస్తా..
- August 25, 2015
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ హామీ హామీలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వండినీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడికి ప్రధాని ఆదేశంమాట ఇచ్చారు.. మీరిక తప్పించుకోలేరు!ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వాల్సిందేవెంకన్న సాక్షిగా ప్రజలకు హామీ ఇచ్చారుఇవేవీ మా రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదుఇవ్వలేకపోతే ప్రజల్ని ఒప్పించే బాధ్యత మీదేప్రధానికి తేల్చిచెప్పిన చంద్రబాబు
‘‘నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అనుకూలంగా లేవన్న మాట నిజమే! కానీ, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నిజమే. వాటిలో మనం దేనిని ఎంత వరకు చేయగలం అన్న దానిపై కసరత్తు చేయండి. వీలైనంత త్వరగా నాకు నివేదిక ఇవ్వండి’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాను ఆదేశించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా, తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీ ప్రజలకు హామీలు ఇచ్చిన మాట కూడా నిజమేనని, నవ్యాంధ్రను ఆదుకుంటానని తిరుపతిలో తానే చెప్పానని, ఢిల్లీకి దీటైన రాజధానిని కూడా నిర్మిస్తానని చెప్పానని, మళ్లీ తిరుపతికి వచ్చి తానే ప్రకటన చేస్తానని మోదీ భరోసా ఇచ్చారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







