బహ్రెయిన్ ఇండియా వీక్ 2016లో కొత్త బిజినెస్ ఐడియాస్
- November 04, 2016
బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో డిసెంబర్ 1, 2 తేదీల్లో జరగనున్న బహ్రెయిన్ ఇండియా వీక్ 2016లో ఇరు దేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు కొత్త కొత్త ఐడియాలతో తమ ప్రత్యేకతను చాటుకోనున్నాయి. బి 2 బి సెషన్స్, కల్చరల్ పెర్ఫామెన్సెస్ మరియు ఇతర యాక్టివిటీస్ ఈ కార్యక్రమంలో హైలైట్ కానున్నాయి. ఇండియన్ అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, ఇండియా - బహ్రెయిన్ మధ్య వ్యాపార సంబంధాలు మరింత మెరుగపడేందుకు ఈ ఈవెంట్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న దశాబ్ద కాలంలో ఇండియా డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ సాధిస్తుందని ఆయన చెప్పారు. బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (బిసిసిఐ) ఛైర్మన్ ఖాలిద్ అలమోయెద్ మాట్లాడుతూ, బహ్రెయిన్ ప్రోగ్రెస్‌లో ఇండియన్స్ పాత్ర ఎక్కువగా ఉండటం ఆనందదాయకమైన విషమన్నారు. ఈ సందర్భంగా భారత పార్లమెంటు సభ్యుడు మనోజ్ తివారీ మాట్లాడుతూ, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ ఇరు దేశాల మధ్య స్ట్రాంగ్ ఎకనమిక్ మరియు కల్చరల్ టైస్ కోసం ఉపయోగడపాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







