మోసుల్ నుండి పరారైన ఐసిస్ చీఫ్
- November 04, 2016
ఇరాక్ లోని మోసుల్ నగరం నుంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ పారిపోయాడని బ్రిటన్ వెల్లడించింది. బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు.
ఐఎస్ ఉగ్రవాదులను ఉద్దేశిస్తూ బాగ్దాదీ మాట్లాడిన ఆడియోను గురువారం విడుదల చేసినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. మోసుల్ కోసం చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తామనే నమ్మకముందని, ఇరాక్ భద్రత దళాలపై పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా బాగ్దాదీ తన అనుచరులను ఆదేశించాడు. ఇరాక్ దళాలను ఎదుర్కోవడంలో వెనుకంజవేయవద్దని సూచించాడు. దీన్నిబట్టి బాగ్దాదీ మోసుల్ నుంచి మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లాడని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపినట్టు బోరిస్ జాన్సన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







