దుబాయ్‌లో షారుఖ్‌ఖాన్‌ షూటింగ్‌

- November 05, 2016 , by Maagulf
దుబాయ్‌లో షారుఖ్‌ఖాన్‌ షూటింగ్‌

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ఖాన్‌, దుబాయ్‌లో శుక్రవారం 'షూటింగ్‌' కోసం వచ్చారు. దుబాయ్‌ టూరిజంకి సంబంధించి పలు వీడియోల షూటింగ్‌ కోసం వచ్చిన షారుక్‌ఖాన్‌ దుబాయ్‌తో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. దుబాయ్‌ని తన రెండో సొంతిల్లులా పేర్కొన్న షారుక్‌ఖాన్‌, సినిమా షూటింగుల కోసం, స్నేహితులతో సరాదాగా విహారం కోసం దుబాయ్‌కి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాననీ, ఈ క్రమంలో దుబాయ్‌ వాసులు తనను ఆదరించే తీరు చాలా అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నాడు. దుబాయ్‌ తనకు ఎంతో నచ్చిన సిటీ అని అన్నాడు షారుక్‌ఖాన్‌. డిసెంబర్‌లో దుబాయ్‌ టూరిజం తరఫున ఈ వీడియోస్‌ పలు ఛానళ్ళలో ప్రసారం కానున్నాయి. దుబాయ్‌ టూరిజం అండ్‌ కామర్స్‌ మార్కెటింగ్‌ ఈ వీడియోల్ని చిత్రీకరిస్తోంది. షారుక్‌ఖాన్‌ నటించిన సూపర్‌ హిట్‌ ఫిలిం 'హ్యాపీ న్యూ ఇయర్‌' దుబాయ్‌లో చిత్రీకరణ జరుపుకుంది. 'డియర్‌ జిందగీ' సినిమాలో నటిస్తున్నాడు షారుక్‌ ప్రస్తుతం. అలియా భట్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌. గౌరీ షిండే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com