తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం జనవరి 3న ప్రత్యేక షో
- November 06, 2016
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నారు. అయితే సినిమా విడుదల తేదీకి మూడు వారాల ముందుగానే ఫస్టు కాఫీ చేతికి వచ్చేలా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది శాతకర్ణి టీమ్. అక్కడి నుంచి ప్రమోషన్స్ భారీగా చేపట్టనున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం జనవరి 3న ప్రత్యేకంగా షో వేయనున్నారని టాక్. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవం కేసీఆర్ చేతుల మీదుగా జరుగగా. ఆడియో రిలీజ్ ను చంద్రబాబుతో చేయించాలని భావిస్తున్నారట బాలయ్య.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









