అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న మహిళ....

- November 06, 2016 , by Maagulf
అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న మహిళ....

అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న మహిళను దిల్లీ విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేశారు. సుమారు రూ.61 లక్షల విలువ చేసే బంగారాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. బంగారు కడ్డీలను ఒక మహిళ తన దుస్తుల మధ్యలో ఉంచి తరలిస్తుండటాన్ని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తనిఖీల్లో భాగంగా గుర్తించారు. కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు దుబాయి నుంచి వచ్చినట్లు తెలిపారు. 1,400 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల 12 బంగారు కడ్డీలు, సహా 110 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.61.37 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com