ఉత్తర బాగ్దాద్‌లోని తిక్రిత్ సిటీ సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఆత్మాహుతి దాడి..
- November 06, 2016
ఉత్తర బాగ్దాద్‌లోని తిక్రిత్ సిటీ సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఆదివారం ఉదయం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. మృతులలో ఐదుగురు విద్యార్థినులు, ఒక మహిళ, ముగ్గురు పోలీసులు ఉన్నారు. చెక్‌పాయింట్ వద్ద రద్దీగా ఉన్న సమయంలో ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్ధాలు నింపిన కారుతో చెక్‌పాయింట్ మీదుగా దూసుకుపోయి తనను తాను పేల్చేసుకున్నట్టు సలాహుద్దీన్ ప్రావిన్స్ ప్రతినిధి అలి అల్ హందాని తెలిపారు. కాగా, ఈ దాడికి తామే బాధ్యులమని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. అయితే గతంలో ఇదే తరహా దాడులకు పాల్పడిన ఐఎస్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా అనుమానిస్తున్నారు.సున్నీ ఉగ్రవాదులు బహిరంగ ప్రదేశాల్లో పౌరులు, ఇరాక్ సెక్యూరిటీ దళాలను లక్ష్యం చేసుకుని దాడులు జరపడం పరిపాటి. బాగ్దాద్‌కు 130 కిలోమీటర్ల దూరంలోని తిక్రిత్ నుంచి ఐఎస్ మిలిటెంట్లను 2015 ఏప్రిల్‌లో ఇరాక్ దళాలు తరిమికొట్టాయి
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









