జమైకా పబ్లో కాల్పులు..ముగ్గురి మృతి
- November 06, 2016
జమైకాలోని ఒక పబ్లో డామినస్(వస్తువులు కనుగొనే ఆట) ఆడుతున్న నలుగురిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో ముగ్గురు మరణించగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. జమైకాలోని సెయింట్ కాథరిన్ పారిష్ పబ్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ మరణించగా మరో వ్యక్తికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి నిలకడగానే ఉందని వారు చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. సాయుధుడు వీరిపై కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియలేదు.దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







