ఒమన్ కు చెందిన ముగ్గురు జాలర్లు జాక్ పాట్
- November 06, 2016
ఒమన్ కు చెందిన ముగ్గురు జాలర్లు జాక్ పాట్ కొట్టారు. కురాయత్ ప్రావిన్సు సమీపంలో గత వారం వేటకు వెళ్లిన వారికి సముద్రపు నీటిలో కొట్టుకెళ్తున్న అత్యంత అరుదైన తిమింగలపు శుక్ర కణం వారి దొరికినట్లు ఖలీద్ అల్ సినాని అనే జాలరి చెప్పాడు.
తిమింగలాల శుక్ర కణాలను ప్రత్యేక పర్ ఫ్యూమ్ ల తయారీలో వినియోగిస్తారు. చేపల వేటకు వెళ్లిన సమయంలో పెద్ద ఎత్తున దుర్వాసన వస్తుండటంతో అటువైపుగా వెళ్లామని సినాని చెప్పాడు. కొట్టుకెళ్తున్న తిమింగలపు శుక్ర కణాన్ని తన సహచరుల సాయంతో తాడుకు కట్టి బోటులోకి ఎక్కించుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత అమితానందంతో ఒడ్డుకు వచ్చినట్లు చెప్పాడు.
మొదటి రెండు రోజుల పాటు దుర్వాసనను వెదజల్లిన శుక్ర కణం ఆ తర్వాత సువాసన ఇవ్వడం మొదలు పెట్టిందని తెలిపాడు.
నిపుణులతో పరిశీలించని తర్వాత శుక్ర కణాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించి ఎండబెట్టినట్లు చెప్పాడు. కాగా, 18 కిలోల బరువు గల శుక్రకణం విలువ దాదాపు 2.5 మిలియన్ డాలర్లు పలికే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







