ఓటు వేయడానికి వెళ్ళేవారికి ఐసిస్ హెచ్చరిక
- November 06, 2016
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఓట్లు వేయడానికి వెళ్లే ఆ దేశ పౌరులను నరికేస్తామని ఐసిస్ హెచ్చరించింది. అంతేకాకుండా ముస్లిలను ఓటింగ్ కు దూరంగా ఉండాలని కూడా కోరినట్లు యూఎస్ కు చెందిన ఎస్ఐటీఈ ఇంటిలిజెన్స్ గ్రూప్ పేర్కొంది. ఈ మేరకు ఇప్పటికే ఉగ్రవాదులు అమెరికాలోకి చొరబడ్డారని చెప్పింది.
ఇందుకు సంబంధించిన ఏడు పేజీల మ్యానిఫెస్టోని అమెరికాలోని ఓ దినపత్రిక ప్రచురించింది. ఎన్నికల వేళ బ్యాలెట్ బాక్సులను కూడా ధ్వంసం చేయాలని ఐసిస్ ఉగ్రవాదులకు సూచించినట్లు తెలిసింది. రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల పాలసీలు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఐసిస్ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేర్కొంది.
దీంతో ఫెడరల్ ప్రభుత్వ సంస్ధలు ఎన్నికల రోజు దాడిపై అలర్ట్ ను ప్రకటించాయి. న్యూయార్క్, వర్జీనియా, టెక్సాస్ లలో దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎఫ్ బీఐ పేర్కొంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







