వేలాది కార్డులను బ్లాక్ చేసిన టెస్కో బ్యాంక్
- November 06, 2016
బ్యాంకు మోసాల నిరోధక వ్యవస్థ అనుమానాస్పద కార్యకలాపాన్ని గుర్తించడంతో వేలాది కస్టమర్ కార్డులను టెస్కో బ్యాంక్ బ్లాక్ చేసింది. కొందరు ఖాతాదారులు ఆ బ్యాంకును సామాజిక మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేశారు. బ్యాంకు క్లయింట్లను మోసగాళ్ళు టార్గెట్ చేసినట్లు బ్యాంకు దృష్టికి తీసుకెళ్ళారు. వేలాది అకౌంట్లు మోసగాళ్ళబారినపడ్డాయని సమాచారం. తాను ఎటువంటి లావాదేవీలు జరపకుండానే తన అకౌంట్ బ్యాలెన్స్ 700 పౌండ్లు తగ్గిపోయిందని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. మరొకామె మరింత బాధాకరమైన విషయాన్ని వెల్లడించారు. రేపు నా పిల్లలకు భోజనం పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేకుండా నా ఖాతాలో డబ్బును ఊడ్చేశారని తెలిపారు.
తమ ఖాతాలు హ్యాక్ అయ్యాయని, ఈ-మెయిల్ కానీ, మెసేజ్ కానీ లేకుండానే మా ఖాతాల్లో డబ్బులన్నీ పోయాయని వేలాదిమంది గగ్గోలు పెడుతున్నారు. దీనిపై టెస్కో బ్యాంక్ ఆదివారం ఉదయం స్పందించింది. మోసాల నుంచి ఖాతాదారులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని టెస్కోబ్యాంక్ వెబ్‌సైట్‌లో పేర్కొంది. హ్యాక్‌కు గురైనట్లు అనుమానం ఉన్న కస్టమర్లందరూ వెంటనే తమను సంప్రదించాలని కోరింది.
కొన్ని ఖాతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు తమ ఫ్రాడ్ ప్రివెన్షన్ సిస్టమ్ గుర్తించిందని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా కొందరు ఖాతాదారుల ఖాతాలను స్తంభింపజేశామని, వారికి సందేశాలు పంపించామని వివరించింది. ఈ బ్యాంకు 1997లో ప్రారంభమైంది. 2008 నుంచి టెస్కో పీఎల్‌సీ యాజమాన్యంలో నడుస్తోంది.
ప్రస్తుతం ఈ బ్యాంకుకు దాదాపు 78 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







