ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా
- November 08, 2016
మనామా: సోషల్ మీడియా కొత్తగా రాజకీయాలకు ప్రమోటర్‌గా మారనుంది. ఓటర్లను ఆకర్షించేందుకుగాను నాయకులు సోషల్ మీడియాని ఆశ్రయించడం ఇటీవలి కాలంలో ట్రెండింగ్‌గా మారింది. ప్రమోషనల్ ప్లాట్‌ఫామ్‌ని కూడా పలు సోషల్ మీడియా సంస్థలు ఏర్పాటు చేస్తూ, దానికోసం పెద్ద మొత్తాల్లో వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశాయి. 10,000 కువైటీ దినార్స్ నుంచి 60,000 కువైటీ దినార్స్ వరకూ ఇందుకోసం రాజకీయ నాయకులు లేదా పార్టీలు చెల్లించవలసి ఉంటుంది. అలా చేసినవారికోసం ప్రత్యేకంగా అప్లికేషన్స్ తయారుచేయించే బాధ్యతను ఆయా సంస్థలే తమ భుజాన వేసుకుంటాయి. మొబైల్ అప్లికేషన్స్ ద్వారా సోషల్ మీడియాని ఎక్కువగా వినియోగిస్తున్నవారిని ఈ పొలిటికల్ అప్లికేషన్స్ ద్వారా నాయకులు ఎట్రాక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ప్రచార రంగంలో ఇదొక కొత్త ఒరవడి అని సాంకేతిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకో వైపున ఓటర్లు నవంబర్ 26న పార్లమెంటరీ ఎలక్షన్స్ జరగనుండడంతో అభ్యర్థులు, డబ్బుని వెదజల్లి ఓటర్లను ప్రలోభపెట్టకుండా అధికారిక వర్గాలు అన్ని కోణాల్లోనూ అప్రమత్తతను ప్రదర్శిస్తున్నారు. నాయకులు నిర్వహఙంచే సమావేశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







