జర్మనీలో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్‌

- November 08, 2016 , by Maagulf
జర్మనీలో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్‌

ఇస్లామిక్‌ స్టేట్‌ ఆర్గనైజేషన్‌(ఐఎస్‌) ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్న అయిదుగురిని జర్మనీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జిహాదీ గ్రూపులో సభ్యుల నియామకానికి వారు ఇక్కడికి వచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అహ్మద్‌ అబ్దుల్లా అజీజ్‌ అబ్దుల్లా ఎ. వీరికి నాయకత్వం వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఒక యువకుడితో పాటు అతని కుటుంబాన్నిఈ నెట్‌వర్క్‌ సిరియాలోని ఐఎస్‌ స్థావరానికి పంపినట్టు వెల్లడైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com