రోడ్డు ప్రమాదంలో వలసదారుడి మృతి

- November 09, 2016 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో వలసదారుడి మృతి

దోహాలోని అల్‌ హిలాల్‌ ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయ వలసదారుడు మృతి చెందాడు. 30 ఏళ్ళకు పైగా స్వదేశానికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయిన ఆ వలసదారుడి జీవితం విషాదాంతమైంది. 74 ఏళ్ళ షేక్‌ మొహమ్మద్‌ రౌతర్‌ దావూద్‌ సాహిబ్‌ హాజా మొహిద్దీన్‌, నాలుగు దశాబ్దాలుగా ఖతార్‌లోని ఓ ఇంట్లో పనిచేస్తున్నాడు. వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం అతని ప్రాణాల్ని బలికొంది. యజమాని ఇంటికి దగ్గర్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. తమిళనాడులోని తంజావూర్‌ జిల్లాలోగల తిరువారూర్‌ తాలూకా నుంచి దావూద్‌ సాహిబ్‌, దోహాకి వచ్చాడు. 2018లో అతని పాస్‌పోర్ట్‌ గడువు తీరనుంది. అతనికి స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి, ఇండియన్‌ కమ్యూనిటీని ఆశ్రయించారు బాధితుడి కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు. 1980లో ఓసారి మాత్రమే ఓసారి ఆయన ఇండియాకి వెళ్ళినట్లు తెలియవస్తోంది. మరో ఘటనలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తంజావూరుకి చెందిన మరో భారతీయ వలస కార్మికుడు 14 ఏళ్ళుగా స్వదేశానికి వెళ్ళలేక ఖతార్‌లోనే ప్రాణాలు విడిచాడు హార్ట్‌ ఎటాక్‌తో. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com