పెద్ద నోట్ల రద్దు ప్రభావం సినీ పరిశ్రమపైనా పడింది...!
- November 10, 2016
పెద్ద నోట్ల రద్దు ప్రభావం సామాన్య ప్రజలతో పాటు సినీ పరిశ్రమపైనా పడింది. కేంద్ర ప్రభుత్వం 500, 100 నోట్లు రద్దు చేయడం వల్ల చిత్ర పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన అనంతరం థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో గురువారం ఒక్కరోజే 150 థియేటర్లలో ప్రదర్శనలు రద్దు చేశారు. చేతిలో చలామణీ అయ్యే నోట్లు లేకపోవడం, కొత్త నోట్ల కోసం బ్యాంకుల దగ్గరకి పరుగులు తీయడం వంటి కారణాలతో ప్రజలు థియేటర్ల వైపు కూడా చూడడం లేదు.ఇళ్లలో, కార్యాలయాల్లో, వీధుల్లో, కూడళ్లలో ఎక్కడ చూసినా పెద్దనోటు రద్దు గురించే చర్చ. కిరాణ దుకాణాలు, పాల డెయిరీలు, కూరగాయల మార్కెట్లలో ఎక్కడికి పపోయినా కూడా ఇదే దృశ్యం కన్పిస్తోంది. పలువురు సినీ తారలు సైతం గురువారం కొత్త నోట్ల కోసం బ్యాంకులకు వెళ్లారు. సామాన్య ప్రజాజీవితంపై తీవ్ర ప్రభావం చూపిన పెద్ద నోటు రద్దు సినీ పరిశ్రమని కూడా కుదేలు చేసింది.బుధవారం నుంచే థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గింది. బుధవారం చాలా తక్కువ సంఖ్యలో ప్రేక్షకులు రావడంతో కొన్ని థియేటర్లలో డబ్బు తిరిగిచ్చి ప్రదర్శనలు రద్దు చేశారు. ఆ ప్రభావంతో గురువారం 150 థియేటర్లలో ప్రదర్శనలు రద్దు చేశారు. ఇక గురువారం విడుదల కావాల్సిన జీవీ ప్రకాష్ నటించిన 'కడవుల్ ఇరుక్కాన్ కుమారు' చిత్రాన్ని వచ్చే వారానికి వాయిదా వేశారు.కొత్త నోట్లు కోసం ప్రజలు ఎదురుచూస్తున్న ఈ తరుణంలో సినిమా విడుదల చేయడం తప్పిదమే అవుతుందని భావించి, వచ్చే 17వ తేదీన విడుదల చేయాలని నిర్మాణ సంస్థ నిర్ణయించింది. అయితే శింబు నటించిన 'అచ్చం ఎన్బదు మడమయడా', ప్రభు నటించిన 'మీనకుళంబుమ్ మనబానైయుమ్' చిత్రాలు శుక్రవారమే విడుదల కాబోతున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







