జక్కన్న సోదరుడి "కాట్చి నేరం"

- November 11, 2016 , by Maagulf
జక్కన్న సోదరుడి

ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్న ఎస్‌ఎస్‌ కంచి ప్రస్తుతం తమిళంలో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. పలు తెలుగు చిత్రాలకు కథా రచయితగా పనిచేసిన ఆయన దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. రమా రీల్స్‌ సంస్థ బ్యానరుపై సుధీర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రణధీర్‌, మీరా, కార్తిక్‌, సత్య, అబ్జిత్‌ శర్మ తదితరులు నటిస్తున్నారు. కె.భూపతి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మరగదమణి (కీరవాణి) సంగీతం సమకూరుస్తున్నారు. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ నేటి యువతరం కొన్ని విషయాల్లో పెడదారి పడుతోంది. వాటిపై అవగాహన కల్పించే చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నాం. ఓ ఆధునిక దంపతుల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. బాగా చదువుకుని మొరటు రౌడీలుగా మారిన నలుగురు యువకుల వల్ల.. ఆ కొత్త దంపతులకు పలు సమస్యలు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏమైందన్నదే చిత్ర కథ. ఇది నేటితరం యువకులకు, తల్లిదండ్రులకు చక్కని సందేశాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com